తలైవాస్ రాతను మారుస్తున్న స్టార్
విజయక్రాంతి ఖేల్ విభాగం: యాక్షన్ లేకుండా ఆట సాగితే మజా రాదు. సరిగ్గా ఈ ఆలోచన నుంచే ‘డూ ఆర్ డై’ రెయిడ్ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. ఏదైనా జట్టు పాయింట్ (బోనస్ లేదా టచ్ పాయింట్) లేకుండా రెండు రెయిడ్లు చేసినప్పుడు వచ్చే తదుపరి రెయిడ్‌ను ‘డూ ఆర్ డై’ అంటారు. ఈ రెయిడ్లు చేసేందుకు ప్రాంచైజీలు, కోచ్‌లు కొంత మంది ఆటగాళ్లను సిద్ధం చేస్తుంటారు. తమిళ్ తలైవాస్‌కు ఆడుతున్న సచిన్ తన్వర్ ఇదే కోవలోకి వస్తాడు. పీకేఎల్ వేలంలో తమిళ్ తలైవాస్ సచిన్‌ను రూ. 2.15 కోట్లకు కొనుగోలు చేసింది. పీకేఎల్ చరిత్రలోనే సచిన్‌కు విజయవంతమైన డూ ఆర్ డై స్పెషలిస్ట్ రెయిడర్‌గా పేరుంది. ఇప్పటివరకు సచిన్ 200 పైచిలుకు డూ ఆర్ డై రెయిడ్ పాయింట్లు సాధించాడు. ఈ సీజన్‌లో తమిళ్ తలైవాస్ తొలి స్థానంలో నిలవడంలో సచిన్ ప్రధానపాత్ర పోషించాడు.
జైపూర్ చేతిలో యూపీ చిత్తు
పీకేఎల్‌ెే౧౧లో భాగంగా మంగళవారం హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జైపూర్ 33 యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో యు ముంబా 32 తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయాన్ని అందుకుంది.