calender_icon.png 29 December, 2024 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఆందోళన చెందవద్దు

28-12-2024 06:19:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో కస్తూరిబా పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది సమ్మె కారణంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యార్థులు ఆందోళన చెందవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. శనివారం పట్టణంలోని సోన్ నిర్మల్ అర్బన్ కస్తూర్బా పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పరమేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.