వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పత్తి కొనుగోళ్ళు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పత్తి పంటను అమ్ముకునే క్రమంలో రైతులు మద్దతు ధరల కోసం తాపత్రయపడుతూ తేమ కలిగిన పత్తిని తీసుకువచ్చి సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షణ అవసరం లేదని వచ్చేయాడాది ఫిబ్రవరి నెల వరకు పత్తి కొనుగోలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ భరోసా కల్పించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలోని పలు పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిని యంత్రాల ద్వారా తేమశాతాన్ని పరిశీలించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తేమశాతం అధికంగా నమోదు అవుతుందని తద్వారా సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద తగిన మద్దతు ధర లభించడం లేదన్నారు. జిల్లాలో పండించిన పత్తి పంటను రైతులంతా ఒకేసారి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావడంతో రైతులు నిరీక్షణ చేస్తూ నష్టపోతున్నారని జిల్లాలో ఇంకా వచ్చేయడాది ఫిబ్రవరి మాసం వరకు పత్తి కొనుగోలు సిసిఐ ద్వారా కొనసాగుతాయన్నారు. రైతులు పత్తిని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకు రావాలన్నారు. దళారీల బారినపడి మోసపోవద్దని సూచించారు. సిసిఐ, అగ్రికల్చర్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులు అందరూ రైతులకు అందుబాటులో ఉంటారని ఏమైన సందేహాలు ఉంటే కోనుగోలు కేంద్రంలోని ఫ్లెక్సీలో ఉన్న కంట్రోల్ నెంబర్స్ ఫోన్ చేసి తమ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు.