calender_icon.png 1 March, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్లపై ఆందోళన వద్దు

28-02-2025 10:12:28 PM

బీఎన్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి..

అటవీశాఖ రేంజ్ అధికారికి వినతి పత్రం అందజేత..

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ కలాన్ 201/1 సర్వేలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు ఉత్తర్వు జారీ చేశారని, దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని వివిధ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని సమస్యలను వివరించారు. దీంతో కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులతో కలిసి శుక్రవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.

201/1 సర్వే నెంబర్లు ఉన్న బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-1, ఫేజ్-3, ఎస్ కే డీ నగర్, శ్రీరామ నగర్ కాలనీలకు ఫారెస్ట్ ఆంక్షలు వర్తించవన్నారు. కేవలం 102 ఎకరాల స్థలంపై కోర్టులో కేసు ఉండడంతో ఫారెస్ట్ అధికారులు స్పందించి, కేసులో ఉన్న స్థలంలోని ప్లాంట్లకు రిజిస్ట్రేషన్ చేయకూడదని సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాశారని వివరించారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఉంటే ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఎన్వోసీ పత్రం అందజేస్తామని ఫారెస్ట్ అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో వైదేహి నగర్ కాలనీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ ఫేజ్-1 పోచమ్మ ఆలయ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, కృష్ణారెడ్డి, వినోద్ రెడ్డి, సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.