calender_icon.png 1 October, 2024 | 9:16 PM

రుణమాఫీ కాలేదని ఆందోళన చెందవద్దు

10-09-2024 04:21:53 AM

  1. అర్హులందరికీ అమలు 
  2. మంత్రి శ్రీధర్‌బాబు

మంథని/మహదేవపూర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): రైతు రూణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందవద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకు అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటా రంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులు రుణమాఫీపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోకుండా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వరద బాధితులను తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభకర్‌రెడ్డి, యుత్ అద్యక్షుడు చీమల సందీప్ ఉన్నారు.

మోడల్ స్కూల్ తనిఖీ

మహదేవపూర్: కాటారం మండలం  గం గారం ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను మంత్రి శ్రీధర్‌బాబు తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులతో సమీక్ష సమవేశం ఏర్పాటు చేసి, పాఠశాలకు కావల్సిన వసతుల గురించి తెలుసుకున్నారు. మంత్రి వెంట సబ్ కలెక్టర్ మయాంక గోయాల్, తహసీల్దార్ నాగరాజు ఉన్నారు.