10-02-2025 10:21:01 PM
దస్తూరాబాద్ (విజయక్రాంతి): విద్యుత్‌ను వృథా చేయవద్దు.. ఆదా చేద్దామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈఈ జనార్దన్ రావు అన్నారు. మండలంలోని రేవోజిపేట గ్రామంలో సోమవారం వినియోగదారులకు భద్రతపై, సమస్యలపై, రైతులకు, ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనం విద్యుత్‌ను వృథా చేస్తే భవిష్యత్తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారవుతామన్నారు. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన అవసరమన్నారు. డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. ఇంధన పొదుపు మీద ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఈఈ జనార్దన్ రావు, ఏడీ ఏ శ్రీనివాస్ ని నాయకులు, గ్రామస్తులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, నాయకులు, ఐలయ్య, రాజు నాయక్, శరత్ రెడ్డి, సతన్న, శ్రీనివాస్, కొమురయ్య, మహేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.