calender_icon.png 26 October, 2024 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతికూలత వైపు నడవను

05-07-2024 12:05:00 AM

రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ‘పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్‌లో చివరి సారి కనిపించారు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించారు. ‘నేను కొంత కాలంగా ఇతర వ్యాపారాలు చేసుకుంటున్నాను. సినీ పరిశ్రమలోని లాబీయింగ్ సంస్కృతికి నేను బాధితుడిని. నా జీవితంలో మరిచిపోలేని ఒక దశ ఉంది. నేను నటించిన సినిమాలు హిట్ అయిన దశ నేను మర్చిపోలేనిది. అప్పుడు నా నటనకు ప్రశంసలు వచ్చాయి. అయినప్పటికీ ఒకానొక దశలో నాకు అవకాశాలు రాలేదు. అప్పుడు నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను. ఆ పరిస్థితుల్లో నా ముందు రెండే రెండు ఆప్షన్లు కనిపించాయి.

నేను రెండో దాన్నే ఎంచుకున్నాను. వ్యాపార మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ స్టోరీకి నా అవసరం వచ్చింది.. ముందుకు సాగుతున్నాను. అంతే కానీ పక్షపాత వైఖరితో ప్రతికూలత వైపు నడవదలుచుకోలేదు’ అని చెప్పారు ఒబెరాయ్. అయితే, వివేక్ ఒబెరాయ్‌కు సల్మాన్ ఖాన్‌కు మధ్య గతంలో వైరం నెలకొన్న సంగతి సినీ పరిశ్రమకు తెలిసిన విషయమే. సల్మాన్ ఖాన్ తనను బెదిరించాడంటూ వివేక్ 2003లో ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు.

సల్మాన్ కారణంగానే తన కెరీర్ దెబ్బ తిన్నదంటూ తర్వాతి కాలంలోనూ చెప్తూ వచ్చారు. వివేక్ ఒబెరాయ్‌తో కలిసి నటించనంటూ కత్రినా కైఫ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని కూడా వివేక్ ఉటంకిస్తూ ‘నాతో నటించడానికి ఆ మహిళ (కత్రినా కైఫ్) నిజంగానే ఇష్టపడలేదో, ఇంకేం జరిగిందో? నాకు తెలియదు. ఎవరితో నటించాలనేది నిర్ణయించుకోవడం ఆమెకు ఉన్న ప్రత్యేక హక్కు. అవన్నీ ఇప్పుడు నేను మైక్రోస్కోప్‌లో పెట్టి చూడాలనుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చారు. వివేక్ ఒబెరాయ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.