26-04-2025 12:00:00 AM
మానుకోట డీటీఓ జైపాల్ రెడ్డి
మహబూబాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): విద్యా సంస్థల బస్సుల రోడ్డు టాక్స్ చెల్లింపులో ప్రభుత్వం రాయితీ కల్పిస్తోందని, విద్యార్థులను తీసుకెళ్లడం, బస్సులను మరమ్మతులకు మినహా ఇతర అవసరాలకు వినియోగించకూడదని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) జైపాల్ రెడ్డి తెలిపారు.
వేసవికాలం సెలవుల్లో ఇతర అవసరాలకు బస్సులు వినియోగిస్తూ తమ తనిఖీల్లో పట్టుబడితే ఒక్కో సీటుకు త్రైమాసికానికి రూ.3,285 టాక్స్ వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని విద్యాసంస్థల యాజమాన్యం గుర్తించి, ఇతర అవసరాలకు విద్యాసంస్థల బస్సులను వినియోగించకూడదని తెలిపారు.