హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 11: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు పెద్దచెరువు కబ్జాకు గురైందన్న నేపథ్యంలో రెండురోజులుగా చేపడుతున్న సర్వేలో భాగంగా బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించారు. సర్వేకు సంబం ధించిన వివరాలను హైడ్రా సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సి పల్ నిధులతో చెరువు భూమి లో రోడ్డు నిర్మాణం కోసం తీర్మానం చేయడంతో పాటు నిదులు ఎలా కేటాయిస్తారని పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డిపై.. రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశా రు.
అయితే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం అయ్యింది కానీ.. ఇంకా నిధులు కేటాయించలేదని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. రంగనాథ్ మాట్లాడుతూ.. సర్వే పూర్తయిన తర్వాత పట్టాభూమి బార్డర్‌లో రోడ్డు ఫిక్స్ చేయాలని హైడ్రా సిబ్బందికి సూచించారు. రైతులు పొలాలకు వెళ్లడానికి రోడ్డు ఉండేది కాబట్టి చెరువుభూమి, పట్టాభూమి బార్డర్ నుంచి రోడ్డు వేసుకోవడానికి రైతులకు వెసులుబాటు కల్పించాలని సిబ్బందికి సూచించారు. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ బానోత్ దూదియ, హైడ్రా తహసీల్దార్ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు.