మధ్య దళారులను నమ్మవద్దు
డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం
ఖానాపూర్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మధ్య దళారులను నమ్మవద్దని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు రాజుర సత్యం అన్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని అనేక చోట్ల దళారులు లబ్ధిదారులను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అన్నారు.
కాగా ఈ విషయంలో నేరుగా ఎమ్మెల్యే, స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించాలని, ఎవరు కూడా మోసపోవద్దని అన్నారు. దాంతోపాటు ప్రజా ప్రభుత్వం త్వరలో ప్రారంభించే భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు కోసం ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలను ఇంకా ఖరారు చేయలేదని ప్రజలు ఎటువంటి అయోమయానికి గురి కావద్దని ఆయన అన్నారు.






