calender_icon.png 7 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యార్థుల గోస పట్టదా?

07-11-2024 01:02:41 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): గురుకుల పాఠశాలల్లో వరుసగా ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరుగుతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రిపా లైన ఘటన మరుకముం దే, తాజాగా మంచిర్యాల గిరిజన ఆశ్ర మ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడం దారు ణమన్నారు. 12 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరడం బాధ కలిగిస్తోందని, ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు.