calender_icon.png 1 March, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వాగులు, నదుల వద్ద సెల్ఫీలు తీసుకోవద్దు

02-09-2024 02:37:28 AM

హైదరాబాద్,సెప్టెంబర్1 (విజయక్రాంతి): వాగులు, నదులు పొంగిపొ ర్లుతుంటే పలు చోట్ల ప్రజలు వంతెన లు ఎక్కి చూడటం, సెల్ఫీలు తీసుకోవడం మంచిది కాదని సీఎస్ శాంతి కుమారి ఆదివారం ఒక ప్రకటనలో  సూచించారు. సెల్ఫీలు తీసుకునే సమయంలో బ్రిడ్జి,  వంతెనలు కొట్టుకు పోతే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఈ విధమైన ఘటనలు అక్కడక్కడ ఎదురవుతున్నాయన్నారు. దయచేసి వాగులు, చెరు వులు, నదులు వద్దకు వెళ్లవద్దని సీఎస్ విజ్ఞప్తి చేశారు.