calender_icon.png 23 January, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అక్షయ’కు అప్పగించొద్దు

16-07-2024 01:43:43 AM

  • మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ 
  • హయత్‌నగర్‌లో దీక్ష, సీఐటీయూ మద్దతు

అబ్దుల్లాపూర్‌మెట్/ఎల్బీనగర్, జూలై 15: మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పగించవద్దని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో హయత్‌నగర్ విజయవాడ జాతీయ రహదారి అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు ఏర్పుల నర్సింహ మాట్లాడుతూ.. గ్రామాల్లో డ్వాక్రా గ్రూపు మహిళలు స్వచ్ఛందంగా ఎటువంటి లాభాలు ఆశించకుండా 23 ఏండ్లుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్నారని గుర్తు చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్షయప్రాత స్వచ్ఛంద సంస్థకు ఇస్తుండటంతో వేలాది మంది మహిళల కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. అక్షయ పాత్రకు అప్పగిస్తే మహిళలకు న్యాయం చేసేవరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు నవనీత, మంజుల, స్వరూప, లక్ష్మమ్మ, రమాదేవి, రంగమ్మ, నిర్మలమ్మ, రాజమణి, రాములమ్మ, వెంకటమ్మ, మంగమ్మ వనజ తదితరులు పాల్గొన్నారు.