calender_icon.png 27 January, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనాన్ని ప్రవేట్ పరం చేయవద్దు

11-12-2024 06:23:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న భోజనాన్ని రద్దు చేసి ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఆపాలని కోరుతూ కార్మికులు బుధవారం డివో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలకు తక్కువ రేట్లకే భోజనాన్ని ప్రభుత్వం మెనూ ప్రకారం అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పడుతుందని దాన్ని వెంటనే ఆపాలని వారు అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్, నాయకులు లక్ష్మి, ఉమా భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.