calender_icon.png 30 September, 2024 | 6:52 AM

స్లమ్ ఏరియాల్లో ప్రతాపం చూపించొద్దు

30-09-2024 02:46:10 AM

మూసీ నిర్వాసితులకు అక్కడే పునరావాసం కల్పించాలి 

ఎమ్మెల్యే దానం నాగేందర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నగరంలోని స్లమ్ ఏరియా ల్లో పేదల ఇళ్లను కూల్చి ప్రతాపం చూపొ ద్దని, నిర్వాసితులకు ఎక్కడికక్కడే పునరా వాసం కల్పించాలని ఎమ్మెల్యే దానం నాగేం దర్ అభిప్రాయపడ్డారు. 30 ఏండ్ల క్రితమే నగరంలో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధుల ను నిర్ణయించారన్నారు.

పేదల ఇళ్లకు మార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మూసీ నిర్వాసితుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఐమా క్స్ థియేటర్, జలవిహార్ మొత్తం చెరువు లోనే నిర్మించారన్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన మిత్రుడు ప్రదీ ప్ రెడ్డి ఎలాంటి అను మతులు లేకుండానే రాజ్‌భవన్ రోడ్‌లో పార్క్ హోటల్ నిర్మా ణం చేపట్టారన్నారు.

దీనికి ఎందుకు పర్మిష న్ ఇచ్చారని దానం నాగేందర్ నిలదీశారు. దీని పక్కనున్న శోభ బిల్డింగ్‌కు కూడా అను మతులు లేవన్నారు. ప్రస్తుతం సీఎం మంచి ఉద్దేశంతో మూసీ సుందరీకరణ పనులు చేపడు తున్నారని, అయితే, ప్రస్తుత పరిస్థితు లను ఆయుధంగా మల్చుకోవడానికి బీఆర్‌ఎస్ కుట్రపన్నుతుం దన్నారు.

ఇప్పటికే ఈ విషయంపై పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలియ జేశానన్నారు. బాధితులు తన వద్దకు వచ్చి వారి సమస్యలను మొరపె ట్టుకుంటున్నా రని, ఈ సమయంలో ప్రజలు సీఎంను శాప నార్థాలు పెడుతుంటే వినలేక పోతున్నాన న్నారు.

గతంలో నాలాలపై ఉన్న ఆక్రమణ లు, కబ్జాలను కూల్చేయాలని కేసీఆర్ అన్నా రన్నారు. కూల్చివేతలపై బీఆర్‌ఎస్ నాయ కులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో లేనప్పుడు మరోలా వ్యవహ రిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రభు త్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని బద్నామ్ చేసేందుకేనని మండిపడ్డారు.