మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి....
అమెజాన్ సాయంతో మీర్ఖాన్పేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం...
మహేశ్వరం (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ గ్రామంలో అమెజాన్ సమస్త వారి సహాయంతో నిర్మించిన డ్వాక్రా భవన్, గ్రంథాలయం, అంగన్వాడి స్కూల్, మంచినీటి ప్లాంట్, ఓపెన్ జిమ్, పార్క్ వంటివి సోమవారం మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి(MLA Sabita Indra Reddy) చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో అమెజాన్ సంస్థ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఫార్మాసిటీలో ప్లాట్లు అమ్ముకోవద్దని రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. మరిన్ని కంపెనీలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ సంస్థ ప్రతినిధులు, కందుకూరు మండలం నాయకులు మీర్ ఖాన్ పేట్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.