సూర్యాపేట, నవంబర్ 14 (విజయక్రాంతి) : సూర్యాపేట గాంధీ పార్క్‌లో గురువారం అనుమతులు లేకుండా శ్రీశైల మూలికా ఫార్మసీ పేరుతో ఆయుర్వేద మందులు అ మ్ముతుండగా డీఎంహెచ్‌వో కోటాచలం అడ్డుకున్నారు.
తమ శాఖ అనుమతి లేకుండా మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. ఈ క్రమంలో అధికారులకు, మందులు కొనేందుకు వచ్చిన ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఔషధాలను పరీక్షించేందుకు అధికారులు శ్యాంపిల్స్‌ను తీసుకెళ్లకపోవడం గమనార్హం.