calender_icon.png 16 March, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములు అమ్మొద్దు..

16-03-2025 05:09:42 PM

రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ భూములు వేలం వేసి అమ్మాలని చూస్తుందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు(President of the National BC Association), రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య(R Krishnaiah) ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులంకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థుల పాటు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ... ప్రభుత్వ స్థలాలు ప్రజల అవసరాలకు పేదల ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వ హాస్టల్స్ కొరకు వినియోగించాలన్నారు. అంతేకానీ అమ్మడానికి కాదన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వ హాస్టళ్లకు గురుకులాలకు స్థలాలు కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్ ముదిరాజ్, అంజి, మణికంఠ, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.