19-03-2025 01:10:23 AM
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): గచ్చిబౌలి భూములను వేలం వేసి విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీకి సంబం ధించిన 400 ఎకరాల భూమిని అమ్మకాని పెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
బీజేవైఎం రాష్ర్ట అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ భవనాలను కట్టించే దమ్ములేదని, సర్కార్ భూములను అమ్ముకుంటూ ఢిల్లీకి సూట్ కేసులు మోయడానికి మాత్రం రేవంత్‌రెడ్డి ముందుంటారని ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే: కాసం వెంకటేశ్వర్లు
రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వే పోయి..భావితరాలకు ఉపయోగపడాల్సిన యూనివర్సిటీ భూములను తెగనమ్మి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు నమ్మకద్రో చేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్ర చేయడమేనని అన్నారు.
మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు..హెచ్‌సీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన బీజేవైఎం నా కా అరెస్ట్ చేయడాన్ని తీ ఖం భూముల అమ్మకాన్ని వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఓ విధించి ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు.
అరెస్టులను ఖండిస్తున్నాం: పొంగులేటి సుధాకర్‌రెడ్డి
శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బీ చేపట్టిన ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని యువ మోర్చా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీ ఖండిస్తున్నట్లు బీజేపీ తమిళనాడు స ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పే హెచ్‌సీయూ భూములను కాపాడాలని తాము డిమాండ్ తెలిపారు.
చేతులకు సంకెళ్లతో నిరసన
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18 (విజయక్రాంతి): ఓయూలో ఆందోళనలు, ధర్నాలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వీతేజ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్ట్స్ కాలేజీ ఎదుట చేతులకు సంకెళ్లు, నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పృథ్వీతేజ మాట్లాడుతూ.. ఓయూలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని, సర్క్యులర్ పేరిట విద్యార్థుల హక్కులను హరింపజేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ మొలుగారం నియంతృత్వ పోకడలు పోతున్నారని విమర్శించారు.
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అరెస్ట్
అదేడసమయంలో అసెంబ్లీకి వస్తున్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బీజేవైఎం నేతల అసెంబ్లీ ముట్టడికి సంఘీభావం ప్రకటించారు. ఒక్కసారిగా బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించేందుకు రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చానని చెప్తున్నా వినకుండా తనను సైతం అరెస్టు చేశారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
రెండు గంటల పాటు పోలీసు వాహనంలో తిప్పి తీసుకువచ్చి అసెంబ్లీ వద్ద దింపారని అన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్‌తో కలిసి అసెంబ్లీ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తనపై దుర్మార్గంగా వ్యవహరించడం సరైన చర్య కాదన్నారు.