22-03-2025 08:22:59 PM
సూర్యాపేట: వయోజనులు (మైనర్ పిల్లలు) కాని వారికి మద్యం, పోగాకు వంటి మత్తు పదార్థాలను విక్రయించకూడదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. బహిరంగంగా మద్యం త్రాగడం, ధూమపానం (సిగరెట్) చేయడం, ప్రభుత్వ నిషేధిత గుట్కాలు విక్రయించడం లాంటివి చట్టరీత్య నేరమన్నారు. జిల్లా వ్యాప్తంగా అలాంటి వాటిపై నిఘా ఉంచామని తెలిపారు.