calender_icon.png 9 January, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులను ఆశ్రయించవద్దు

08-01-2025 05:56:03 PM

పోలీసులను నేరుగా సంప్రదించాలి...

బైంసా (విజయక్రాంతి): పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చినప్పుడు బాధితులు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) తెలిపారు. బైంసాలో బుధవారం ఆమె బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ తో ఫిర్యాదుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. తాను ప్రతి బుధవారం బైంసా క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయదలచినపుడు సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. దళారులను ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రయించవద్దని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులను విడిపించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.