calender_icon.png 23 September, 2024 | 7:59 PM

తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించద్దు

23-09-2024 05:26:29 PM

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై పునరాలోచన చేయాలి...

ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం పేరును పెట్టాలని విజ్ఞప్తి... 

జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ

కరీంనగర్,(విజయక్రాంతి): తెలుగు విశ్వవిద్యాలయానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాలనే నిర్ణయం సరైనది కాదని ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ అన్నారు. సోమవారం నగరంలోని తారక హాటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై ఆర్యవైశ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సరైన నిర్ణయం కాదని అన్నారు.

పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో, రాష్ట్రానికి చెందినవారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశంలో గర్వించదగ్గ నాయకుడు అన్నారు. స్వాతంత్య్ర్య ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి గౌరవించుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆంద్రలో పుట్టిన కాసు బ్రహ్మనందరెడ్డి ప్రత్యేక తెలంగాణ ను అణిచే వేసు కుట్ర చేశారన్నారు. ఆయన పేరు మీద కేబీఆర్ పార్కు ఉందన్నారు.

కోట్ల విజయబాస్కర్రెడ్డి లాంటి వారి పేర్ల మీద ఉన్న వాటిని మార్చకుండ ఇలా రాజకీయాల్లో కులబలం ఉన్నవాళ్లదే నడుస్తున్న తీరుగా ఆంధ్రకు చెందిన రెడ్డిల పేరు మీదు ఉన్న వాటిని మార్చకుండా తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడి పేరు మార్చలనుకోవడం దుర్మార్గం అన్నారు. పొట్టి శ్రీరాములను ఒక వైశ్యకులంనకే పరిమితం చేయద్దు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, బీజేపి కేంద్రమంత్రి బండిసంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్, స్తానిక ఎమ్మెల్యే గంగులకమలాకర్ ను కలిసి పేరు తొలగిచవద్దని వినతిపత్రాలు అందిస్తామన్నారు.

ఆర్యవైశ్యులను రాజకీయంగా అణిచేవేసు కుట్ర జరుగుతుందన్నారు.ప్రధాని మోడీ ఈడబ్ల్యూ స్కీం తీసుకరావడంతో వైశ్యలకు మేలు జరిగిందన్నారు. పేరు తొలిగించే నిర్ణయం పై పునారాలోచించాలని లేని యెడల మండల, పట్టణాలలో 'పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈసమావేశంలో జిల్లా యువజన అధ్యక్షుడు జీడిగే సాయికృష్ణ, పట్టణ అధ్యక్షులు నగునూర్ రాజేందర్, జిల్లా కోశాధికారి పడకంటి శ్రీనివాస్, పట్టణ భ్రపదాన కార్యదర్శి వేణుగోపాల్ పెద్ది, మహిళా సంఘం అధ్యక్షురాలు స్వప్న శ్రీనివాస్, మాజీ ప్రధాన కార్యదర్శి శివనాధుని శ్రీనివాస్, విద్యాకమిటీ చైర్మన్ మంచాల సుధాకర్,పొలిటికల్ చైర్మన్ రామిడి శ్రీధర్, సేవాదళ్ అధ్యక్షులు, ఎలగందుల మునిందర్, వివాహ పరిచయ వేదిక చైర్మన్ రాచమల్ల భద్రచయ్య, మీడియా కన్వీనర్ చిట్టిమల్ల మహేందర్, తదితరుల ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.