రాఖీ కట్టుకొచ్చినా.. బొట్టు, మెహిందీ పెట్టుకొచ్చినా..
పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు పండుగల విషయంలో లేనిపోని నిబంధనలు పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. బాలల హక్కుల జాతీయ కమిషన్ దృష్టికి ఈ అంశం వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులను శిక్షించొద్దని తెలిపింది. ఎవరైనా విద్యార్థులు రాఖీలు ధరించి, మెహిందీ, తిలకం పెట్టుకొని వస్తే శిక్షించొద్దని ఆదేశించింది. విద్యార్థులను ఎట్టిపరిస్థితు ల్లోనూ శిక్షించొద్దని కమిషన్ సూచించిన మేరకు పాఠశాల విద్యాశాఖ అన్నీ స్కూళ్లకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.