calender_icon.png 7 November, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు గనులను ప్రైవేటీకరించొద్దు

30-06-2024 01:21:05 AM

  • సీపీఎం నాయకుల డిమాండ్, ధర్నాలు

ఆదిలాబాద్/సూర్యాపేట (విజయ క్రాంతి) /బెల్లంపల్లి, జూన్ 29: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం సీపీఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో సింగరేణి కాలరీస్ బొగ్గు గనులను వేలం పాట దారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించడం తగదన్నారు. బొగ్గు గనుల శాఖా మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాదు కేంద్రంగానే వేలంపాట ప్రక్రియను ప్రారంభించడం అన్యాయమన్నారు. వేలంపాట కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బొగ్గు బ్లాకులన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తరాత సింగరేణికి మిగిలేదేముందని ప్రశ్నించారు.

క్రమంగా సింగరేణి సంస్థ బలహీనపడి మూతపడేలా మోదీ ప్రభుతం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలని కోరారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదరి దరనాల మల్లేష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బెల్లంపల్లిలో మంచిర్యాల జిల్లా కమిటీ రాజకీయ శిక్షణ తరగతుల్లో బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడారు. 10న దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తామన్నారు.