అమ్మల ఉసురు పోసుకోకండి!
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్స్ పెరిగి పోతుండడం దురదృష్టకరం. వ్యాపార యావలో పడి మానవత్వాన్ని సమాధి చేయబూనడం దారుణం. ఒకప్పుడు సిజేరియన్స్ అంటే చాలా అరుదుగా జరిగేవి. కానీ, గత కొన్నేళ్లుగా ఇవి సర్వసాధారణమైనాయి. గత 9 నెలల గడువులోనే ప్రైవేటులో 2,713, ప్రభుత్వ పరంగా 1,845 సిజేరియన్లు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ తరం అమ్మాయిలు నొప్పులకు భయపడుతున్నారని వైద్యులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు.
- శ్రీసుమా కళ్యాణి, ఉప్పల్