calender_icon.png 19 November, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు ఇవ్వరా?

19-11-2024 12:19:57 AM

మాజీ సర్పంచుల ఎదురుచూపు

కరీంనగర్, నవంబరు 18 (విజయక్రాంతి): గ్రామాల్లో తమ సొంత డబ్బు వెచ్చించి అభివృద్ధి పనులు చేసిన తాజా మాజీ సర్పం చులు ఆ బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. బిల్లుల కోసం మాజీ సర్పంచులు ఆందోళన చేసిన ప్రతిసారి నిధులు విడుదల చేస్తామంటు న్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ముంద డుగు వేయలేదు. కరీంనగర్‌లో సమావేశమైన మాజీ సర్పంచులు మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

కరీంనగర్ జిల్లాకు రూ.6 కోట్లు

కరీంనగర్ జిల్లాలో 313 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు అందలేదు. మౌలిక సదుపాయల కల్పనకు వెచ్చించే ఈ నిధులు జిల్లాకు రూ.6 కోట్లు రావాల్సి ఉంది. అలాగే ఎస్‌ఎఫ్‌సీ నిధులు కూడా రాలేదు.

దీంతో ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకే రూ.కోటి 12 లక్షల బకాయిలు ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి 137 పంచాయతీలు రూ.43.17 లక్షల బకాయిలు పడ్డాయి. అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులకు రూ.13 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. 

సీఎం పర్యటనను అడ్డుకుంటాం

సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించాలని, లేనియెడల 20న ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఉమ్మడి జిల్లా మాజీ సర్పంచులు హెచ్చరిం చారు. ఈ నెల 25న కరీంనగర్ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.