జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు
భూత్పూర్‌లో ఆర్‌ఎంపీ క్లినిక్ సీజ్
మహబూబ్‌నగర్, మే17(విజయక్రాంతి): ప్రాథమిక వైద్య సదుపాయాలకు సంబంధించి సూచనలు, సలహాలు అందించాల్సిన ఆర్‌ఎంపీ వైద్యులు స్థాయికి మించి వైద్యం చేయొద్దని జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ తిరుపతిరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం భూత్పూర్ మండంలోని వివిధ గ్రామాల్లో ఆర్‌ఎంపీల క్లినిక్‌లను తనిఖీ చేశారు. పలువురు ఆర్‌ఎంపీ తాము డాక్టర్లమని ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసుకోవడంతోపాటు బెడ్స్ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు పాటించని అమ్మ శ్రీసంతోష్ క్లినిక్‌ను సీజ్ చేశారు. తనిఖీల్లో సీహెచ్‌వో అయూబ్‌ఖాన్, హెల్త్ అసిస్టెంట్ ప్రమోద్, కానిస్టేబుల్ ఎస్ రవీందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.