calender_icon.png 12 December, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడుభూములను స్వాధీనం చేసుకోవద్దు

11-07-2024 12:32:02 AM

పోలీసులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచన

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై10 (విజయక్రాంతి): ఫారెస్ట్ అధికారులు పోడు భూము లను స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సూచించారు. కాగజ్‌నగర్ మండలంలోని కడంబా శివారులోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా ప్లాన్‌టేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుధవారం రైతులతో కలసి పోడు భూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు బల గాలను వెంటపెట్టుకొని ఫారెస్టు అధికారులు దౌర్జన్యంగా పోడు భూములను స్వాధఋనం చేసుకుంటున్నారని ఆరోపించారు. సాగులో ఉన్న పోడు భూములకు జోలిక వెళ్లొద్దని ళ్లవద్దని సీఎం చెప్పటినప్పటీకి వినడంలేదని విమ ర్శించారు. పోడు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిం చారు. అనంతరం కౌటాల మండలంలో 132/ 33 కేవీ సబ్ స్టేషన్ పనులు పరిశీలించారు.