కేసీఆర్ కిట్, కంటి వెలుగు అమలు చేయండి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
హుజూరాబాద్, అక్టోబరు 15: ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజల ఆరోగ్యంపై డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం డాక్టర్లు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గర్భిణులకు సోమవారం డాక్టర్లు డెలివరీ చేయకుండా ఆలస్యం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదల ఆరోగ్యం కోసమే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రోగికి కూడా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కోపం ఉంటే కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకుల మీద తీర్చుకోవాలని పేద ప్రజలపై కాదన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉన్నదని, వెంటనే పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. గర్భిణులకు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్‌తోపాటు కేసీఆర్ కిట్‌ను అందించా లన్నారు.
ఆడపిల్ల పుడితే రూ.13,000, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు ఇవ్వాలని డిమా ండ్ చేశారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే వెం ట అడిషనల్, డిప్యూటీ డీఎంహెచ్‌వో చం దూలాల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రా జారెడ్డి, ఆర్‌ఎంవో సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక, శ్రీనివాస్ ఉన్నారు.