calender_icon.png 26 December, 2024 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గ్రామాలను యాదాద్రి జిల్లాలో కలపొద్దు

04-08-2024 12:10:16 AM

మంత్రి సీతక్కకు గ్రామస్తుల వినతి

ఘట్‌కేసర్, ఆగస్టు 3: అవుషాపూర్, అంకుషాపూర్,  మాదారం గ్రామాలను యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపే ప్రతిపాదనలను రాష్ట్రప్రభుత్వం విరమించు కోవాలని కోరుతూ గ్రామస్తులు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలని, లేదంటే తమ మండలాన్ని కొనసాగించాలన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం తమ గ్రామాలను యాదాద్రి జిల్లాలో కలిపేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. సమస్యపై మంత్రి సీతక్క  సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు.