calender_icon.png 29 November, 2024 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో మా గ్రామాలు కలుపొద్దు

24-09-2024 01:48:40 AM

గోపాల్‌పూర్, దుర్శేడ్‌వాసుల డిమాండ్.. రాస్తారోకో 

కరీంనగర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలను కరీంనగర్ నగరపాలక స ంస్థలో విలీనం చేసే ప్రతిపాదనలను విరమి ంచుకోవాలని గోపాల్‌పూర్, దుర్శేడ్ గ్రామా ల ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం గోపాల్‌పూర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశా రు. ఆయా గ్రామాల నుంచి ప్లకార్డులతో ర్యా లీగా వచ్చి ధర్నా నిర్వహించారు. ఇక్కడి ప్రజ లు తనను ఓడగొట్టారనే కక్షతోనే విలీన ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ తెరమీ దకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఇలాం టి కక్ష ప్రజలపై చూపకుండా మంచి చేసి ఎ న్నికల్లోకి రావాలని సూచించారు. కలెక్టర్ చొ రవ తీసుకుని గ్రామాల్లో ఎంతమంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారో, ఎం త మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారో విచారణ చేపట్టి, విలీన ప్రక్రియను రద్దు చేయాలని కోరారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్ నాయయకులు మద్దతు తెలిపారు.