calender_icon.png 17 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాటా నమోదులో తప్పులుండొద్దు

17-11-2024 02:04:32 AM

  1. 20వేల డాటా ఎంట్రీ ఆపరేటర్స్ నియామకం
  2. తొలి విడతలో 300మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ
  3. కులగణన రాష్ర్ట నోడల్ అధికారి అనుదీప్

హైదరాబాద్, నవంబర్ 16(విజయక్రాంతి): సమగ్ర సర్వే డాటాను ఆన్‌లైన్ చేసేందుకు 20వేల మంది డాటాఎంట్రీ ఆపరేటర్లను ఎంపిక చేసినట్లు కులగణన రాష్ర్ట నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం హైదరాబాద్ షేక్‌పేట నా రాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో  ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 300మంది మాస్టర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు.

ఇక్కడ శిక్షణ పొందిన వారు జిల్లా ల్లో మిగిలిన వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ శిబిరంలో డాటా ఎంట్రీ నమోదు విధివిదానాలను అనుదీప్ వివరించారు. ఆపరే టర్లు డాటా నమోదులో తప్పులు లేకుండా పక్కగా చేయాలన్నారు. రాష్ర్టంలో ఇప్పటివరకు 50 శాతానికి పైగా.. కొన్ని జిల్లాల్లో 70 శాతం సర్వే పూర్తయినట్టు వెల్లడించారు.

ప్రతి జిల్లాకు ఒక ఎంట్రీ నమోదు కోసం లాగిన్ ఇస్తామన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్లకు ఈ శిక్షణ ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ సంచాలకులు ఓం ప్రకాశ్, ప్రణాళిక శాఖ సంచాలకులు రూఫస్ దత్తం, సీసీజీ ప్రాజెక్టు మేనేజర్ లోకేశ్, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.