కేకే 5 గని మేనేజర్ ప్రవీణ్...
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే 5 గనిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులలో కొద్దిమంది కార్మికులు తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నారని కార్మికులు గైర్హాజరు పేరిట ఉద్యోగాలు కోల్పోవద్దని గని మేనేజర్ ప్రవీణ్ కోరారు. బుధవారం కేకే 5 గనిపై గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ సంస్థలో లేని విధంగా సింగరేణిలో మంచి వేతనాలు ఉన్నాయన్నారు. కార్మికులకు విధుల వద్ద ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా ఇతరులకు చెప్పడం ద్వారా పరిష్కారానికి మార్గం దొరుకుతుందని అన్నారు.
కార్పొరేట్ కార్యాలయం నుండి గైర్హాజరుకు సంబంధించి సర్కులర్ వచ్చిందని భూగర్భ కార్మికులు ప్రతినెల 16 మాస్టర్లు, ఉపరితల కార్మికులు 20 మస్టర్లు చేయాల్సి ఉంటుందని సర్క్యులర్ జారీ అయిందన్నారు. గైర్హాజర్ కార్మికులకు ప్రతినెల కౌన్సిలింగ్ ఉంటుందని, తరచూ విధులకు గైర్హాజరు అయి మస్టర్లు లేక డిస్మిస్ అయ్యే అవకాశాలున్నాయని తద్వార డిస్మిస్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన గుర్తు చేశారు. అనారోగ్యంతో పాటు ప్రమాదాల బారిన పడి గాయాలు అయిన కార్మికులు వారి పరిస్థితిని పై అధికారుల దృష్టికి తీసుకు వెళితే కొద్ది రోజులు సర్ఫేస్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆన్నారు. గైర్హాజరవుతూ కుటుంబాలకు, సింగరేణి సంస్థకు భారం కావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి రమేష్, సంక్షేమ అధికారి మాస్కుల కార్తీక్, ఆఫీస్ సూపరిండెంట్ బుచ్చయ్య, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ లు పాల్గొన్నారు.