అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): శబరిమల వెళ్లే భక్తులు రైళ్లలో హారతి, అగరొత్తులను వెలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలైకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వేనడుపుతోంది. ఈ రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరి మార్గమధ్యంలో పలు స్టేషన్లలో ఆగుతాయి.
ఈ సందర్భంగా అక్కడి నుంచి తమ ప్రయా ణాన్ని ప్రారంభించే అయ్యప్ప భక్తులు కోచ్‌ల లోపల పూజలో భాగంగా క ర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వ డం, అగర్‌బత్తులు, సాంబ్రాణి వెలిగించడం చేస్తున్నారని అధికారులు వా పోతున్నారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణాల్లో మండే స్వభావంగల పదార్థా లతో ప్రయాణం చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు.
ఇలాంటి చర్యలు భద్రతకు తీవ్ర ముప్పును కలిగించి అగ్ని ప్రమాదాలకు దారితీ స్తాయ zని పేర్కొంటున్నారు. దీంతో ప్రాణాలకు ముప్పుతో పాటు రైల్వే ఆస్తులకు నష్టం కూడా కలిగే ప్రమా దం ఉందన్నారు. రైల్వే చట్టం-1989లోని సెక్షన్లు 67, 154, 164, 165 ప్రకారం రైళ్లలో ఇలాంటి చర్యలు శిక్షార్హమైన నేరంగా పరిగణించబడతాయ ని అధికారులు స్పష్టం చేశారు. ఇం దుకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తామని హెచ్చరించారు.