calender_icon.png 18 January, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాదారులను వదిలిపెట్టం

17-07-2024 06:43:27 AM

  • మంథని తహసీల్దార్ హెచ్చరిక 
  • బిట్టుపల్లి పెద్ద చెరువును పరిశీలించిన అధికారులు

మంథని, జూలై 16 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బిట్టుపల్లి పెద్ద చెరువు కబ్జా దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంథని తహసీల్దార్ రాజయ్య హెచ్చరించారు. బిట్టుపల్లి పెద్ద చెరువును గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని గ్రామస్థులు రెండు రోజులుగా అందోళన చేయగా స్పందించిన తహశీల్దార్ మంగళవారం ఎస్సై వెంకటకృష్ణతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తహసీల్దార్‌ను చెరువు వద్దకు తీసుకెళ్లి కబ్జాకు గురైన స్థలాన్ని చూపించారు. కొన్నేండ్ల నుంచి నడుస్తున్న దారిని కూడా దున్నడంతో తహశీల్దార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు నడుస్తున్న దారి, కట్టను దున్నితే తమకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. సమస్యను పరిష్కరించడంతో తహశీల్దార్, ఎస్సైకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.