calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చొద్దు

13-08-2024 03:41:09 AM

  1. 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థుల మృత్యువాత 
  2. బీఆర్‌ఎస్ తరఫున ఆర్‌ఎస్పీ ఆధర్యంలో అధ్యయన కమిటీ  
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే.తారకరామారావు 
  4. పెద్దాపూర్‌లో మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ కుటుంబానికి పరామర్శ 

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 12 (విజయక్రాంతి): ప్రభుత సంక్షేమ పాఠశాలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుతమే తల్లితండ్రి మాదిరిగా బాధ్యత తీసుకోవాలని, మిగతా విద్యార్థుల తల్లితండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. ఇటీవల జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో కేటీఆర్ పరామరించారు.

ప్రభుత సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు.  అనిరుధ్ మరణం ఆ తల్లితండ్రులతోపాటు ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధించిందని చెప్పారు. వేర్వేరు కారణాలతో చనిపోయిన 36 మంది విద్యార్థుల కుటుంబాలను ప్రభుతం ఆదుకోవాలని కోరారు. గతంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధర్యంలో తమ పార్టీ తరఫున ఒక అధ్యయన కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. కమిటీ 20 పాఠశాలలను పరిశీలించిఐదారు రోజుల్లో నివేదిక ఇస్తారన్నారు. ప్రభుతానికి సూచనలు చేసే మంచి ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నామని స్పష్టంచేశారు. దీన్ని రాజకీయంగా భావించవద్దని కోరారు.