calender_icon.png 24 November, 2024 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాను వదిలేదే లే!

21-10-2024 12:33:45 AM

ఈ నెలాఖరులో రిటైర్డ్ కానున్న ఓ అధికారి.. ఎక్స్‌టెన్షన్ కోసం తీవ్ర ప్రయత్నాలు

  1. రిటైర్డ్ అయినా కదలని సీపీఆర్వో 
  2. కొన్నేళ్లుగా కొనసాగుతున్న మరో అధికారిణి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల కాలపరిమితి పూర్తికాగానే సాధారణంగా హాయిగా రెస్ట్ తీసుకుంటుంటారు. కానీ, కొందరు ఉద్యోగులు తమ సర్వీస్ పూర్తయినా.. పెన్ష న్ వస్తున్నా.. ఇంకా కొన్నేళ్ల పాటు సర్కార్ కొలువులోనే కొనసాగాలని ఆశపడుతున్నారు.

అయితే, ఈ తరహాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నియామకాలను ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యతిరేకించింది. రిటైర్డ్ అయినా కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలని ఆదేశా లు జారీ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీలోనూ అనేక మంది ఉద్యోగులు తమ అద నపు ఉద్యోగ కాలాన్ని వదిలేసి స్వచ్ఛందంగానే వెళ్లారు.

కానీ, జీహెచ్‌ఎంసీలో మళ్లీ ఆ సంప్రదాయం కొనసాగుతుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. పలువురు అధికారులు తమ ఉద్యోగ కాలపరిమితి ముగిసినా ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతూ పాత జీతాన్నే పొందాలని భావిస్తున్నారు. 

ఉద్యోగ విరమణ పొందినా.. 

జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌లో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ అధికారిణి కొన్నేళ్ల క్రితమే రిటైర్డ్ అయ్యారు. ప్రభుత్వ స్థాయిలో తనకున్న పలుకుబడితో తిరిగి అదే ఉద్యోగంలో ఎక్స్‌టెన్షన్ పేరుతో కొన సాగుతున్నారు. ఇటీవల ఆ గడువు కూడా పూర్తయినా, ఆ స్థానంలో మరొకరు నియామకమయ్యే దాకా గత జీహెచ్‌ఎంసీ కమిషనర్ తనకున్న విచక్షణాధికారులను వినియోగించి తిరిగి కొనసాగాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవలనే రిటైర్డ్ అయిన చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్వో) కూడా ఇంకా అదే హోదాలో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. సమాచార శాఖ నుంచి బల్దియా సీపీఆర్వోగా మరొకరిని పంపే వరకు ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన సీపీఆర్వోను కొనసాగించాలని ఇటీవలనే జీహెచ్ ఎంసీ కమిషనర్ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన అధికారిణి ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన లేఖను సమాచార పౌరసరఫరాల శాఖకు కూడా రాసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెలాఖరులో రిటైర్డ్ కానున్న చీఫ్ ఎంటమాలజిస్ట్ తిరిగి అదే హోదాలో కొనసాగేందుకు ప్రభుత్వంలోని ఓ మంత్రి వద్ద పైరవీని  ముమ్మరం చేసినట్టుగా సమాచారం.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో వేలాది మంది ఉద్యోగ విరమణ పొం దినా తిరిగి పలు శాఖల్లో అదే స్థాయిలో కొనసాగుతుండటంపై కొత్త ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. తక్షణమే ఎవరికి వారే స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలి వెళ్లాలని సీఎం స్థాయిలోనే ఆదేశించడంతో ఎక్కడి వాళ్లు అక్కడే సర్ధుకున్నారు.

ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీలో ప్రధాన కార్యాల యంతో పాటు వివిధ జోన్లు, సర్కిళ్లలో కొనసాగుతున్న అనేక మంది అధికారులు దాదాపుగా వెళ్లారు. కానీ ప్రస్తు తం ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోనట్లుగా తెలుస్తోంది. సమాచార శాఖ నుంచి బల్దియాకు తక్షణమే సీపీఆర్వోను నియామకం చేయాల్సి ఉన్నప్ప టికీ, సుముఖంగా ఉన్నవాళ్లను ఉన్నతాధికారులు అంగీకరించకపోవడం, మరొ కరు అయిష్టత వ్యక్తం చేస్తున్న కారణం గా జీహెచ్‌ఎంసీలో సీపీఆర్వో పోస్టు భర్తీలో జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

కమాండ్ కంట్రోల్ ఇన్‌చార్జి అధికారిణి, సీపీఆర్వోలు రిటైర్మెంట్ తర్వాత కూడా తిరిగి ఉద్యోగంలో కొనసాగడంతో జీహెచ్‌ఎంసీలో గత ప్రభు త్వంలో కొనసాగిన పాత సంప్రదాయం పునరావృతం అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.