calender_icon.png 23 January, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ వివాదాల్లో జోక్యం వద్దు

23-01-2025 01:34:57 AM

* పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): భూవివాదాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కేవలం నమోదైన కేసుల దర్యాప్తునకే పరిమితం కావాలని ఆదేశించింది. కొండాపూర్‌లో తమ స్వాధీనంలోని స్థలం నుంచి ఖాళీ చేయించడానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దంపతులకు పోలీసులు సహకరిస్తున్నారంటూ షేక్ ఇస్లాముద్దీన్‌తో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ బీ విజయసేనారెడ్డి బుధవారం విచారణ చేపట్టి సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పారు.  శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేశారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వేదు ల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ 2022 ఫిబ్రవరిలో పిటిషనర్ల మధ్య అవగాహన ఒప్పందం ఉందని, సర్వే నెం.87లో 5.04 ఎకరాలపై చట్టపరమైన హక్కులు ఉన్నాయని తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి దపంతులకు ఎలాంటి హక్కులు లేవని,  పోలీసుల సహకారంతో పిటిషనర్లను ఖాళీ చేయించడా నికి ప్రయత్నిస్తున్నారన్నారు. వైవీ తరఫున సీనియర్ న్యాయవాది కె.వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2006లో కొనుగోలు చేశారని, 2014 నుంచి వైవీ సుబ్బారెడ్డి భార్య పేరు మీద ఉం దని తెలిపారు. నామినేషన్ల సమయం లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో కూడా ఈ భూమి వివరాలను వెల్లడించారన్నారు.