13-03-2025 02:07:22 AM
స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్
హైదరాబాద్, మార్చి 12(విజయక్రాంతి) : ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీ ల్లో ఫీజులను పెంచొద్దని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు రాహుల్‌నాయక్, శివకృష్ణ, జవ్వాజి దిలీప్ కోరారు. ఈ మేరకు బుధవారం టీఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గోపాల్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు చదువుకునే అవకాశం ఉండేలా ఫీజులను నిర్ణయించాలన్నారు. ఫీజులను అడ్డగోలుగా పెంచి పేద విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జల్లెడ బ్రహ్మం, పూల అరవింద్, నితిన్, తదితరులు పాల్గొన్నారు.