calender_icon.png 17 November, 2024 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలాలను విస్మరించకూడదు

05-08-2024 12:40:50 AM

యూఎఫ్‌బీయూ జాతీయ కన్వీనర్ జీడీ నడాఫ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): రిజర్వేషన్లతో లబ్ధి పొందిన ఎస్సీ, ఎస్టీ అధికారులు తమ మూలాలను విస్మరించ కూడదని యూఎఫ్‌బీయూ జాతీయ కన్వీనర్, ఎస్‌బీఐ సెంట్రల్ బోర్డు మాజీ డైరెక్టర్ జీడీ నడాఫ్ అన్నారు. ఆదివారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ వేల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశాన్ని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నారాయణగూడలో నిర్వహించారు. ముందుగా అ తిథులు ముందుగా డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జీడీ న డాఫ్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలు ఐక్యంగా ముందుకు సాగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. టీజీపీఎస్సీ సభ్యుడు వై.రామ్మోహనరావు మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో అధికారులు భాగస్వాములు  కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి పంపాల నర్సింహ, ఐఎఫ్‌టీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మురళీదర్శన్, హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు హట్కర్ శంకర్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయప్రసాద్, బ్రహ్మనాదరావు, విక్ర మ్, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.