calender_icon.png 2 April, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దు

16-12-2024 10:39:59 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్లక్ష్యం చేయవద్దని వాటికి పరిష్కార మార్గాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి అర్జీలను స్వీకరించి వారు చెప్పి సమస్యలను విన్న కలెక్టర్ వారి పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తులను ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ డిఆర్ఓ రత్నా కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.