ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 12 (విజ యక్రాంతి) : భౌతిక దాడులతో అధికారులు, ఉద్యోగుల మనోస్థుర్యైన్ని దెబ్బతీయొద్దని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి సూచించా రు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని, ఎలాంటి సమస్య లున్నా చర్చలతో పరిష్కరించుకోవచ్చ ని మంగళవారం ఆయన ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపై జరిగిన దాడిని చిన్నారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాభవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కొడంగల్‌ను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.