calender_icon.png 6 November, 2024 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేపై ఎలాంటి అపోహలు వద్దు

06-11-2024 04:21:42 PM

చేవెళ్ల (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేతో రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని ప్రజల్లో అపోహలు ఉన్నాయని, అలాంటిది ఏమి ఉండదని ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఈ సర్వే చేపడుతున్నామని వెల్లడించారు. బుధవారం శంకర్పల్లిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వేలో ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యుమరేటర్ను నియమించామని చెప్పారు. ఈ సర్వే ఆధారంగా అన్ని వర్గాల అభివృద్దికి ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్, కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.