28-03-2025 09:25:39 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించవద్దని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో శుక్రవారం మహాజన సభ నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించడంతో సింగిల్ విండోలకు ఆదాయం రావడంలేదని తెలిపారు అందుకోసం మహిళా సంఘాలకు అప్పగించకుండా సింగిల్ విండోలే కేంద్రాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని సంఘం తీర్మానించింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, సంజీవరెడ్డి,సిబ్బంది నర్సింలు,బాలకిషన్, నితీష్ రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు