12-03-2025 06:24:32 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని గని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ 2 విస్తరణకు అనుమతులు ఇవ్వొద్దని బుధవారం నిర్వాసిత రైతులు నిజామాబాద్ లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్(Telangana Pollution Control Board Chief Engineer Laxman Prasad)కు వినతి పత్రం అందజేశారు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వల్ల ప్రభావిత గ్రామాల్లో జరుగుతున్న కాలుష్యాలను, పంటల నష్టాలను వివరించి ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత రైతులు సింగతి సత్యనారాయణ, రామగోని అశోక్ గౌడ్, సింగతి రవి, భాగం సుమన్, గోమాత వినోద్ కుమార్, సదువుల వెంకటరమణ, భూక్య రాజు, బోయినపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.