calender_icon.png 24 April, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు

23-04-2025 11:33:22 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మైనర్లకు వాహనాలు ఇస్తే ఇచ్చిన వాహనదారులు, తల్లిదండ్రులు, మైనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) హెచ్చరించారు. బుధవారం రాత్రి కేసముద్రం పట్టణంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పలువురు మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. దీనితో మైనర్లకు, వాహనాలను ఇచ్చిన యజమానులకు, తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకనుంచి మైనర్లకు వాహనాలు ఇస్తే చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలిపెట్టారు.