calender_icon.png 17 January, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ బస్సుల నిర్వహణ కార్పొరేట్ సంస్థలకు ఇవ్వొద్దు

18-01-2025 12:00:00 AM

* ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి

హైదరాబాద్, జనవరి 16(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం డీజిల్ బస్సుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి పర్యావరణ పరిరక్షణ పేరుతో విద్యుత్ బస్సులను తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీలకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

ఈమేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సబ్సిడీల పేరుతో ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టొద్దన్నారు. 2030 వరకు పూర్తి స్థాయిలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టినట్లయితే ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్, మెకానిక్, శ్రామిక్, 50శాతం కండక్టర్లు ఉద్యోగాలు కోల్పోతారన్నారు. ఆర్టీసీ డిపోలను చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పేరుతో ప్రైవేట్ వారికి అప్పగించవద్దని కోరారు.