calender_icon.png 13 October, 2024 | 7:55 PM

భయపెట్టేలా ఐటీ నోటీసులు ఇవ్వకండి

22-08-2024 12:30:00 AM

ఆదాయపు పన్ను శాఖ వార్షికోత్సవంలో సీతారామన్

న్యూఢిల్లీ, ఆగస్టు 21: పన్ను చెల్లింపుదారులకు పంపించే నోటీసులు, లేఖలు భయపెట్టేలా ఉండకూడదని, వారికి అర్థమయ్యే రీతిలో సరళమైన పదాల్లో ఉండాలంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. 165వ ఇన్‌కమ్ టాక్స్ వార్షికోత్సవాల్లో మంత్రి ప్రసంగిస్తూ పన్ను చెల్లింపు       దారులతో అధికారులు స్నేహపూర్వక ధోరణిని అవలంబించాలని కోరారు. నోటీసు అసెస్సీకి స్పష్టంగా అర్థమయ్యేరీతిలో ఉండాలని, నోటీసు ఎందుకు జారీచేస్తున్నారో కారణం తెలియపర్చాలని సూచించారు. పన్ను రిఫండ్స్ మరింత వేగవంతం చేసే అవకాశం ఉన్నదని చెప్పారు.