బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్...
మునుగోడు (విజయక్రాంతి): విష రసాయనాలు వెదజల్లే పరిశ్రములకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని కోతులారం గ్రామంలో గ్రామ నివాసాల పక్కనే ఏర్పాటు చేయదలిచిన కోళ్ల పరిశ్రమపై గ్రామ స్పెషల్ అధికారి విజయ బాస్కర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి కోళ్ల పరిశ్రమ అనుమతులపై గ్రామ ప్రజల అభిప్రాలయాలను సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పచ్చని పల్లెలపై చేడు కాలుష్యం వెదజల్లే ప్రైవేట్ పార్మా కంపెనీలు, కోళ్ల పరిశ్రమలు పంటలు పండే వ్యవసాయం భూములలో అక్రమంగా వ్యాపార దృక్పథంతో గ్రామీణ ప్రాంతాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, గ్రామ ప్రజలు చేడు వాసనలు వెదజల్లే కోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని, వ్యాపారుల ప్రయోజనాల కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని గ్రామ ప్రజలు ముక్త కంఠంతొ వ్యతిరేకించారు.
ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వట్టికోటి శేఖర్, గ్రామ కార్యదర్శి బాబు, మాజీ సర్పంచ్లు జాజుల పారిజాత సత్యనారాయణ, జక్కలి లోకేష్, జాజుల వెంకటేష్, పందుల అంజయ్య, వట్టికోటి వెంకటేష్, గురిజా నర్సింహ గౌడ్, జాల బచ్చి ప్రసాద్ యాదవ్, చకందుల ప్రభాకర్, పందుల నరసింహ, కందుల రాజు, జాజుల రామకాంత్, ఏపూరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.