ఉన్నతాధికారులకు టీఎన్జీవో విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): జలసౌధలో మంగళవారం తలపె ట్టిన ‘ఎక్స్టెన్షన్ వద్దు-ప్రమోషన్ ముద్దు’ అనే నిరసన కార్యక్రమానికి టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు శ్యామ్ హాజరై మద్దతు తెలిపారు. ఈమేరకు ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (పరిపాలన) అనికుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎట్టి పరిస్థితుల్లో అధికారులకు ఎక్స్టెన్షన్కు సిఫార్సు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్ లేక దాదాపు 200 మంది సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అనంతరం సెక్రటేరియట్లో నీటిపారుదల శాఖ సెక్రెటరీ రాహుల్ బొజ్జాను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంజినీర్లు, యూనియన్ నాయకులు రామారావు, బండి శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.